Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన రేవంత్ రెడ్డి, నారా లోకేశ్

Revanth Reddy and Nara Lokesh thanks to Junior NTR

  • భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం
  • బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న సినీ ప్రముఖులు
  • రెండు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన ఎన్టీఆర్

భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధులకు ఆయన ఈ విరాళాన్ని అందజేయనున్నారు. 

వరద బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించిన తారక్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు. విరాళం అందించిన మరో హీరో విష్వక్సేన్ కు కూడా రేవంత్, లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News