Trains: వర్షాలు, వరదల ఎఫెక్ట్... విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు

SCR cancelled and diverted some trains

  • ఏపీ, తెలంగాణలో వర్షాలు, వరదల బీభత్సం
  • రవాణా రంగంపై తీవ్ర ప్రభావం
  • కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. విజయవాడ పరిధిలోనూ పలు రైళ్లను రద్దు చేశారు. 

తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను తెనాలి మీదుగా దారి మళ్లించారు. కృష్ణా ఎక్స్ ప్రెస్, శబరి, విశాఖ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే పద్మావతి ఎక్స్ ప్రెస్ ఐదున్నర గంటలు ఆలస్యంగా నడుస్తోంది. 

విశాఖపట్నం-నాందేడ్, నాందేడ్-విశాఖపట్నం రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నై సెంట్రల్-శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా ఎక్స్ ప్రెస్ ను విజయవాడ, విశాఖ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు.

  • Loading...

More Telugu News