Anti Rape Bill: యాంటీ రేప్ బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం... చరిత్రాత్మకమన్న మమతా బెనర్జీ

Bengal Assembly Unanimously Passes Anti  Rape Bill

  • 'అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు'కు ఆమోదం
  • బిల్లుకు పూర్తి మద్దతు పలికిన ప్రతిపక్షం
  • డాక్టర్ ను హత్యాచారం చేసిన వారిని ఉరి తీయాలన్న మమత

యాంటీ రేప్ (అత్యాచార నిరోధక) బిల్లుకు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుకు ప్రతిపక్షం కూడా పూర్తి మద్దతు పలికింది. 'అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు' పేరిట బెంగాల్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలో చర్చ అనంతరం బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. 

ఈ బిల్లు చరిత్రాత్మకమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని రాష్ట్ర గవర్నర్ ను ప్రతిపక్షం అడగాలని కోరారు. మహిళా డాక్టర్ ను హత్యాచారం చేసిన వారిని ఉరి తీయాలని అన్నారు. మృతురాలికి సీబీఐ న్యాయం చేయాలని కోరారు.


  • Loading...

More Telugu News