Chandrababu: వచ్చాడు... ఐదు నిమిషాలు షో చేసి వెళ్లాడు: సీఎం చంద్రబాబు

CM Chandrababu fires on Jagan

  • నిన్న జగన్ విజయవాడలో పర్యటన
  • కనీసం ఒక వ్యక్తికైనా ప్యాకెట్ భోజనం ఇచ్చాడా అంటూ చంద్రబాబు విమర్శలు
  • పనికిరాని చేష్టలు అంటూ ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మీడియాతో మాట్లాడారు. నిన్న జగన్ విజయవాడలో వరద ప్రాంతాల్లో చేసిన పర్యటనపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 

"ఏంటండీ ఇది... నిన్న వచ్చాడు.. ఐదు నిమిషాలు షో చేసి వెళ్లాడు. కనీసం ఒక వ్యక్తికి ప్యాకెట్ భోజనం ఇచ్చాడా? ఒక వ్యక్తిని పరామర్శించాడా? ఒక వ్యక్తికి భరోసా ఇచ్చాడా అండీ? ఆ పేపర్ ఉంది కదా... పాజిటివ్ గా రాయొచ్చు కదా! 

ఏమిటి ఇవన్నీ? వికృతమైన చేష్టలు! పనికిరాని చేష్టలు! ఎవరూ చేయరు ఇవన్నీ! అందుకే నేను చెప్పాను... ఎస్కోబార్ (మాఫియా డాన్) అని. ఎస్కోబార్ కూడా ఏం చేసినా ఇదే మాదిరిగా చేసేవాడు" అంటూ వ్యాఖ్యానించారు.

Chandrababu
Jagan
Vijayawada Floods
TDP-JanaSena-BJP Alliance
YSRCP
  • Loading...

More Telugu News