Ram Mohan Naidu: ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా?: జగన్ పై రామ్మోహన్ నాయుడు విమర్శలు

Ram Mohan Naidu fires on Jagan

  • చంద్రబాబు ఇంటికి, బుడమేరుకు సంబంధం ఏమిటని రామ్మోహన్ నాయుడు ప్రశ్న
  • వరద సమయంలో రాజకీయాలు సరికాదని వ్యాఖ్య
  • జగన్ ఇప్పటికైనా మారాలని హితవు

వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి... ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు గుప్పిస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ పై కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. 

వరద సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు ఇంటికి, బుడమేరుకు సంబంధం ఏమిటని... ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోతే ఎలాగని ఎద్దేవా చేశారు. విపత్తుల సమయంలో ఎలా పని చేయాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. 

ఇప్పటికైనా జగన్ మారాలని... లేకపోతే ప్రజలు ఆయనను శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేస్తారని అన్నారు. ఏపీని అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే సాంకేతిక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 

Ram Mohan Naidu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News