Chaddi Baniyan Gang: నిన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’.. ఇప్పుడు ‘చెడ్డీగ్యాంగ్’.. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు

Chaddi Baniyan Gang Strikes Nasik Steals 5 Lakh Gold

  • మహారాష్ట్రలో వాలిన చెడ్డీగ్యాంగ్
  • నాసిక్‌లోని మాలెగావ్‌లో రూ. 5 లక్షల విలువైన బంగారం చోరీ
  • గతవారం మాలెగావ్ వాసులను భయపెట్టిన ‘గౌన్‌గ్యాంగ్’

నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలను భయకంపితులను చేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు మహారాష్ట్రలో వాలింది. నాసిక్‌లోని మాలెగావ్‌లో ఓ ఇంటితోపాటు కాలేజీలోకి చొరబడిన దొంగలు రూ. 5 లక్షల విలువైన 70 గ్రాముల బంగారంతోపాటు అరటిపండ్లను ఎత్తుకెళ్లారు. చెడ్డీ, బనియన్ ధరించిన దొంగలు ఆవరణలోకి ప్రవేశించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. 

మాలెగావ్‌లో నిన్నమొన్నటి వరకు ‘గౌన్‌గ్యాంగ్’ హల్‌చల్ చేయగా, ఇప్పుడు చెడ్డీగ్యాంగ్ రంగంలోకి దిగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గౌన్‌గ్యాంగ్ సభ్యులు మహిళల గౌన్లు ధరించి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. పదునైన ఆయుధాలు ధరించిన ఈ గ్యాంగ్ గతవారం పలు ఇళ్లను దోచుకుంది. ఓ ఆలయంలోని డొనేషన్ బాక్స్‌లోని డబ్బును కూడా ఎత్తుకెళ్లింది.

More Telugu News