Chandrababu: వరద ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించనున్న చంద్రబాబు

Chandrababu aerial view today in Vijayawada

  • వరదలతో చిరుగుటాకులా వణికిన విజయవాడ
  • యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టిన ప్రభుత్వం
  • పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం

జల విలయంలో విజయవాడ నగరం చిగురుటాకులా వణికింది. నగర ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికారు. ఎన్నడూ లేనంతగా వచ్చిన వరదలతో నగరంలోని సింగ్ నగర్, నున్న, పాయకాపురం, భవానీపురం, న్యూ రాజేశ్వరిపేట, నందమూరి నగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్ ను చేపట్టింది. సీఎం చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి... రాత్రింబవళ్లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా బాధిత ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ధైర్యం చెపుతున్నారు. మరోవైపు వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఈరోజు ఏరియల్స్ వ్యూ చేయనున్నారు.

Chandrababu
Vijayawada
Aerial View
  • Loading...

More Telugu News