Helicopter Pilots: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఇద్దరు కోస్ట్‌గార్డు పైలట్ల గల్లంతు
![Coast Guard pilots missing after helicopter makes emergency landing](https://imgd.ap7am.com/thumbnail/cr-20240903tn66d69e00a1474.jpg)
సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు, ఒక డైవర్ కోసం భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్‌గార్డ్) పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో వెళ్తున్న హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో గత రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది.
హెలికాప్టర్.. నౌకను సమీపిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు డైవర్లలో ఒకరిని రక్షించామని, మరో డైవర్, ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నాలుగు నౌకలు, రెండు విమానాలతో గాలింపు చేపడుతున్నట్టు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది.