Music Director Thaman: అమ్మా... నా పరువు తీయొద్దు: తమన్

thaman mother shares a funny story about her son

  • ఓ సింగిల్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న తమన్
  • లేటెస్ట్ ఎపిసోడ్‌కు అతిధిగా హాజరైన తమన్ తల్లి 
  • చిన్నప్పటి విషయాలను ముచ్చటించిన తల్లి  

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ తాజా కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకూ ఆది ఏమిటంటే ..పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా తమన్ పనిచేస్తూనే ఓ సింగిల్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్ కు తమన్ తల్లి అతిధిగా హాజరయ్యారు. ఈ సమయంలో తమన్ బాల్యం గురించి కొన్ని విషయాలు చెప్పమని హోస్ట్ అమెను కోరారు. 

దీనికి ఆమె బదులిస్తూ.. పాఠశాల రోజుల్లో తమన్ అసలు హోమ్ వర్క్ చేసే వాడు కాదని అన్నారు. తాము నివాసం ఉన్న భవనంలోని ఓ పోర్షన్ లో ఉండే అమ్మాయి బాగా చదివేదని చెప్పారు. ఇంతలో తమన్ కల్పించుకున్నారు. 'కొవిడ్ లాక్ డౌన్ లో వాట్సప్ గ్రుపు ద్వారా ఆ అమ్మాయి మళ్లీ కలిసింది. ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తుంటుంది. ఆ విషయాలన్నీ చెప్పి, నా పరువు తీయొద్దు అమ్మా' అని తమన్ అనడంతో అక్కడ నవ్యులు పూశాయి.

More Telugu News