Venkaiah Naidu: వరద విలయం... రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu donation to AP and TG

  • జలవిలయంపై వెంకయ్యనాయుడు విచారం
  • ఏపీ, తెలంగాణకు రూ. 5 లక్షల చొప్పున విరాళం
  • సాయం చేయాలని మోదీకి ఫోన్ చేశానని వెల్లడి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. జల విలయంలో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. 

తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి ఆయన విరాళం ప్రకటించారు. రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఆయన కుమారుడు, కూతురు కూడా రెండు రాష్ట్రాలకు రూ. 2.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ప్రధాని మోదీకి తాను ఫోన్ చేశానని... రెండు రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని కోరానని తెలిపారు. ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారులు టచ్ లో ఉన్నారని మోదీ తనకు చెప్పారని అన్నారు. ఇరు రాష్ట్రాలకు సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Venkaiah Naidu
Andhra Pradesh
Telangana
Donation
Floods
  • Loading...

More Telugu News