Jalandhara: చంద్రమోహన్ పిసినారి కాదు... రూ.1,500కి కారు తాకట్టు పెట్టాము: భార్య జలంధర

Jalandhara Chandramohan Interview

  • వందల సినిమాలలో నటించిన చంద్రమోహన్ 
  • ఆయన పిసినారి అంటూ జరిగిన ప్రచారం 
  • పరిస్థితులు అందుకు కారణమన్న జలంధర 
  • ఖర్చు విషయంలో జాగ్రత్తపడేవారని వ్యాఖ్య


చంద్రమోహన్... కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన నటుడు. కొన్ని పాత్రలలో ఆయనను చూస్తే, ఆ పాత్రలను ఆయన తప్ప ఎవరూ చేయలేరనే ఒక భావన కలుగుతుంది. అలాంటి చంద్రమోహన్ కి నటుడిగా మంచి పేరు ఉంది. అయితే ఆయన చాలా పిసినారి అనే ఒక విమర్శ కూడా వినిపిస్తూ ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన భార్య జలంధర దగ్గర ఇదే విషయాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. 

జలంధర మాట్లాడుతూ... "చంద్రమోహన్ గారు పిసినారి కాదు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా... పెరిగిన వాతావరణం వలన ఖర్చు విషయంలో కొన్ని లెక్కలు వేసేవారు. అనవసరంగా ఏవీ కొనేవారు కాదు. ఏది అవసరమో... ఏది ముఖ్యమో వాటిని మాత్రమే కొనేవారు. చాలా కాలం పాటు టీవీ కొనకపోతే, మా పిల్లలు పక్కింటికి వెళ్లి చూసేవారు. ఫ్రిడ్జ్ తీసుకోవడానికి కూడా చాలా సమయమే పట్టింది" అని అన్నారు. 

"ఒకసారి కారు కొన్నా... ఇల్లు కొన్నా... ఖరీదైన వస్తువులు కొన్నా మళ్లీ అమ్మకూడదు. ఆ విషయాన్ని ముందుగా ఆలోచన చేసిన తరువాతనే కొనాలి అనేవారు. సినిమాల్లో అవకాశాలు ఎప్పుడు ఉంటాయో... ఎప్పుడు ఉండవో ఎవరికీ తెలియదు. అందువలన ఏదైనా కొనడానికి ఆయన భయపడేవారు. ఒకానొక సమయంలో 1,500 రూపాయల కోసం మా కారును తాకట్టు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి" అని చెప్పారు.  


Jalandhara
Chandra Mohan
Actor
  • Loading...

More Telugu News