Revanth Reddy: ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

CM Revanth Reddy letter to PM Modi

  • తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి
  • వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలంటూ లేఖ
  • తెలంగాణకు తక్షణ సాయం అందించాలన్న సీఎం

భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ అతలాకుతలమైంది. వేలాది బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణలో కురిసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు తక్షణ సాయం అందించాలని కోరారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, రోడ్లపై నీరు నిలిచిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్లను సీఎం ఆదేశించారు. 

దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన మరమ్మతులు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఖమ్మం బయలుదేరారు.

More Telugu News