Chiranjeevi: కల్యాణ్ బాబూ.. నీలాంటి నాయకుడు కావాలి, రావాలి: చిరంజీవి

Chiranjeevi birthday greetings to Pawan Kalyan
  • ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కల్యాణ్
  • ఈ పుట్టినరోజు నీకు మరీ ప్రత్యేకం అన్న చిరంజీవి
  • ప్రజలకు నీలాంటి నాయకుడు కావాలని ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన తమ్ముడు పవన్ కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

"కల్యాణ్ బాబు... ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయతీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!" అని ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్, తన భార్య సురేఖలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
Chiranjeevi
Tollywood
Pawan Kalyan
Janasena

More Telugu News