Ramcharan: మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు: రామ్ చ‌ర‌ణ్‌

Ramcharan Birthday Wishes to Pawan Kalyan

  • నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న శుభాకాంక్ష‌లు
  • 'ఎక్స్' వేదిక‌గా బాబాయ్‌కి విషెస్ తెలిపిన చ‌ర‌ణ్‌

నేడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ, రాజ‌కీయ‌, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తాజాగా జ‌న‌సేనానికి రామ్ చ‌ర‌ణ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. మా పవర్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. 

"మీ బలం, అంకితభావం, అవసరంలో ఉన్నవారి పట్ల కనికరం ఎల్లప్పుడూ నాకు, చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. మీ నిస్వార్థ ప‌నులు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం వాదించే ప్రజల అవసరాలను తీర్చడంలో అంకితభావంతో దృష్టి సారించడం అద్భుతం. ఆంధ్రప్రదేశ్‌లోని అణగారిన వర్గాల జీవితాలపై సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేయడం స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు మార్గనిర్దేశం చేస్తూ, ఆశీర్వదిస్తూ మరింత బలాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను" అని చ‌ర‌ణ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Telugu News