Telangana: తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు అతి తీవ్ర వర్ష సూచన

Hyderabad Meteorological Center predicted heavy rains in Telangana on Monday and Severe rain forecast for some areas

  • నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు, ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో అతి తీవ్ర వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
  • నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
  • హైదరాబాద్‌లో భారీ వానలు పడే అవకాశం ఉందని సూచన


తెలంగాణను గత మూడు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం నేటి (సోమవారం) వాతావరణంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇవాళ కూడా రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర భారీ వర్షాల నుంచి అతి తీవ్రమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ జాబితాలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు, ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని పేర్కొంది.

భారీ నుంచి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయని తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల జాబితాలో కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ-గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట ఉన్నాయని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని, స్థిరంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News