Bigg Boss: అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్-8... ఈసారి కొత్త కాన్సెప్ట్

Bigg Boss Season 8 has began

  • తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్
  • నేడు సీజన్-8 ప్రారంభం
  • కంటెస్టెంట్లను ఇద్దరిద్దరు చొప్పున ఇంట్లోకి పంపిస్తున్న హోస్ట్ నాగార్జున

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-8 వచ్చేసింది. మా టీవీలో ఇవాళ రాత్రి 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. ఎప్పట్లాగానే హోస్ట్ గా నాగార్జున తనదైన శైలిలో జోష్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. 

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి ఎక్కడ ఏముందో పరిచయం చేశారు. బిగ్ బాస్ ఇంట్లో గార్డెన్ ఏరియా, లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లు... ఇలా అన్నింటిని హోమ్ టూర్ ద్వారా పరిచయం చేశారు. 

ఇక, ఈసారి కంటెస్టెంట్ లను ఇంట్లోకి పంపించే విధానాన్ని సరికొత్తగా డిజైన్ చేశారు. ఒక మేల్, ఒక ఫిమేల్ కంటెస్టెంట్ ను ఒక జోడీగా చేసి బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తున్నారు. తొలుత టీవీ నటి యష్మి గౌడ రాగా, ఆ తర్వాత టీవీ నటుడు నిఖిల్ వచ్చాడు. హోస్ట్ నాగార్జున వారిద్దరినీ ఒక జోడీగా చేసి ఇంట్లోకి పంపించారు. ఆ తర్వాత సినీ నటుడు అభయ్ (పెళ్లిచూపులు ఫేమ్), టీవీ నటి ప్రేరణను ఇంకో జోడీ చేసి ఇంట్లోకి పంపించారు.

Bigg Boss
Season-8
Nagarjuna
Reality Show
  • Loading...

More Telugu News