Pawan Kalyan: రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు... 'ఓజీ' రిలీజ్ డేట్ ప్రకటిస్తారా...?

All eyes on Pawan Kalyan OG release date announcement

  • సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'ఓజీ'
  • అభిమానులను ఊరిస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ చిత్రం
  • ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మారిన వైనం
  • రేపు పవన్ పుట్టినరోజు... ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ఓజీ. ఈ హైఓల్టేజ్ యాక్షన్ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. 

పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఓజీ చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడడంతో వారిలో నిరాశ నెలకొంది. రేపు (సెప్టెంబరు 2) పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో, ఓజీ మేకర్స్ నుంచి ఏమైనా అప్ డేట్ రాకపోతుందా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

కాగా, ఈ సినిమా షూటింగ్ కొద్దిభాగం మాత్రమే మిగిలుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కొన్ని డేట్స్ ఇస్తే చాలు... ప్యాకప్ చెప్పేస్తామని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. యువ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ కు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Pawan Kalyan
OG
Release Date
DVV Enetertainment
  • Loading...

More Telugu News