Perni Nani: పేర్ని నానికి ఘోర అవమానం.. కోడిగుడ్లు విసిరిన జనసైనికులు!

Janasena workers attacks Perni Nani

  • గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వెళ్లిన పేర్ని నాని
  • వపన్ కు క్షమాపణలు చెప్పాలంటూ జనసైనికుల ఆందోళన
  • పేర్ని నాని వాహనంపై దాడి

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం ఎదురైంది. ఆయనపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరారు. వివరాల్లోకి వెళితే ఈరోజు పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు వచ్చారు. తోట శివాజీ ఇంటి ముందు పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసైనికులు పేర్ని నానిపై ఒక్కసారిగా కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనతో ఆయన షాక్ కు గురయ్యారు. మరికొందరు పేర్ని నాని కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో నాని కారు అద్దాలు పగిలాయి. అలర్ట్ అయిన పోలీసులు జనసైనికులను అదుపు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జనసైనికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 

మరోవైపు ఘర్షణ సందర్భంగా పేర్ని నానికి జనసైనికులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటి వెళ్లనివ్వబోమని హెచ్చరించారు. చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తిని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడకు రావడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో రెండు చెప్పులతో పవన్ ను పేర్ని నాని అవమానించారని... ఇప్పుడు 36 చెప్పులు రెడీగా ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో, అక్కడి నుంచి పోలీసుల అండతో పేర్ని నాని వెళ్లిపోయారు.

Perni Nani
YSRCP
Janasena
Attack
  • Loading...

More Telugu News