Flood: చిమిర్యాల వాగు ఉద్ధృతి... ఏపీ-తెలంగాణ సరిహద్దులో నిలిచిన వాహనాల రాకపోకలు

Flood halted vehicles between AP and Telangana

  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు
  • చిమిర్యాల, పాలేరు వాగుల ఉగ్రరూపం

చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఏపీ-తెలంగాణ సరిహద్దులో వాహనాల రాకపోకలు  నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉగ్రరూపం దాల్చింది. కోదాడ దిగువన చిమిర్యాల వాగు, పాలేరు భీకరంగా ప్రవహిస్తున్నాయి. 

కోదాడ నుంచి దిగువకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దాంతో చిమిర్యాల వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 

నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News