Khammam: ఖమ్మంలో వరద బీభత్సం

Floods in Khammam

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు
  • ఖమ్మంలో జలాశయాలుగా మారిన పలు కాలనీలు
  • నీట మునిగిన పలు ఇళ్లు

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఖమ్మం నగరంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు కాలనీలు జలాశయాలుగా మారాయి. ఎన్నో ఇళ్లు నీట మునిగాయి. 

ఖమ్మంలోని రాజీవ్ గృహకల్ప కాలనీ, వెంకటేశ్వర నగర్, గణేశ్ నగర్ తదితర ప్రాంతాలను మున్నేరు వరద ముంచెత్తింది. తమను కాపాడాలంటూ వరద నీరు చుట్టుముట్టిన ఇళ్ల నుంచి బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Khammam
Floods
Heavy Rain
  • Loading...

More Telugu News