jio phone: యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో .. అది ఏమిటంటే..?

here are the uses of jio phone call ai feature

  • జియో ఫోన్ కాల్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనే ఫీచర్ అందుబాటులోకి
  • ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో ఏఐ ద్వారా రియల్ టైమ్ రికార్డింగ్, ట్రాన్స్ క్రిప్షన్, మెసేజ్, అనువాదం తదితర సేవలు
  • ఇతర భాషల్లోకి అనువాదం చేసుకునే వెసులుబాటు

ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో .. యూజర్ లకు అనేక సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లను పరిచయం చేస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తొంది. ఈ క్రమంలో దేశంలో ఎక్కువ మంది యూజర్లు ఉన్న నెట్‌వర్క్ గా జియో చలామణి అవుతోంది. తాజాగా రిలయన్స్ జియో మరో కొత్త ఫీచర్ ను ప్రకటించింది. జియో ఫోన్ కాల్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అనే ఫీచర్ ను తీసుకువచ్చింది. 

అన్ని ప్రముఖ కంపెనీలు ఏఐ సేవలను వినియోగించుకుంటున్న నేపథ్యంలో జియో కూడా తమ వినియోగదారులకు దీన్ని పరిచయం చేసింది. ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో ఏఐ ద్వారా రియల్ టైమ్ రికార్డింగ్, ట్రాన్స్ క్రిప్షన్, మెసేజ్, అనువాదం తదితర సేవలు అందుతాయి. దీని ద్వారా మనం మాట్లాడే పదాలను టెక్స్ట్ గా మార్చడం, సంభాషణలను సేవ్ చేయడం, వాటిని వివిధ భాషల్లోకి మార్చడం తదితరాల వాటిని చాలా సులభంగా నిర్వహిస్తుంది.  
 

  • Loading...

More Telugu News