Giriraj Singh: కేంద్రమంత్రిపై బీహార్‌లో దాడికి యత్నం

Giriraj Singh allegedly attacked

  • బెగుసరాయ్‌లోని బల్లియా సబ్ డివిజన్‌లో దాడికి యత్నం
  • నిందితుడిని షాజాద్ అలియాస్ సైఫీగా గుర్తింపు
  • నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు

బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై దాడి ప్రయత్నం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేంద్రమంత్రి బల్లియా సబ్ డివిజన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఘటన జరిగింది. దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆ వ్యక్తిని షాజాద్ అలియాస్ సైఫీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతను సెక్యూరిటీని తోసుకుంటూ వెళ్లి కేంద్రమంత్రిపై దాడికి యత్నించినట్లు తెలిపారు. నిందితుడిని బల్లియా వాసిగా గుర్తించామని, అతను వార్డు కౌన్సిలర్ అని ఎస్పీ మనీష్ తెలిపారు.

తనపై దాడి యత్నం ఘటనపై గిరిరాజ్ సింగ్ స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు, దాడులకు తాను భయపడనని కేంద్రమంత్రి అన్నారు. తన పనిని తాను చేసుకుంటూ వెళతానన్నారు. తనపై దాడి చేసిన వ్యక్తి చేతిలో రివాల్వర్ ఉండి ఉంటే చంపేసేవాడు కూడా అని అన్నారు.

తన పట్ల అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. కానీ తాను లక్ష్యం నుంచి పక్కకు వెళ్లేది లేదన్నారు. భయపడేది లేదు... ఎవరు ఎన్ని బెదిరింపులకు గురిచేసినా తనలో కించిత్ భయం ఉండదన్నారు. ఉన్నతాధికారులు ఎంతోమంది ఉన్నప్పటికీ తన పట్ల ఆ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడని మండిపడ్డారు.

Giriraj Singh
Bihar
  • Loading...

More Telugu News