Cricket: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో రికార్డుల వెల్లువ... క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన ఢిల్లీ టీమ్ ప్లేయర్

Six hitting Ayush Badoni Priyansh Arya break mega record in T20s

  • 19 సిక్సులు 165 పరుగులతో అధరగొట్టిన ఆయుష్ బదోనీ
  • మనన్ భరద్వాజ్ వేసిన 12వ ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టిన ప్రియాన్ష్ ఆర్య
  • ఒకే మ్యాచ్ లో... అత్యధిక భాగస్వామ్యం, అత్యధిక సిక్స్‌లు, రెండో అత్యధిక స్కోర్ రికార్డులు

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఆటగాళ్లు ఆయుష్ బదోనీ, ప్రియాన్ష్ ఆర్య అదరగొట్టారు. ఒక ఇన్నింగ్స్‌లో 19 సిక్స్‌లు కొట్టి బదోనీ... వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ అత్యధిక సిక్సుల రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 18 సిక్సులతో 146 పరుగులు (నాటౌట్) చేశాడు. ఇప్పుడు బదోనీ 19 సిక్సర్లతో గేల్ రికార్డును అధిగమించాడు. 

ఇక, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లతో ప్రియాన్ష్ రికార్డులు సృష్టించారు. వీరిద్దరు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్నారు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ పలు రికార్డులు నమోదు చేసింది.

ఆయుష్ బదోనీ-ప్రియాన్ష్ ఆర్య 286 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇది అత్యుత్తమ భాగస్వామ్యం. వీరిద్దరు 29 సిక్స్‌లు కొట్టారు. మొత్తంగా సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఈ మ్యాచ్‌లో 31 సిక్స్‌లు కొట్టింది. టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఒక జట్టు కొట్టిన అత్యధిక సిక్సులు ఇవే. ఆయుష్ బదోనీ ఒక్కడే 19 సిక్స్‌లు కొట్టి క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. మనన్ భరద్వాజ్ వేసిన 12వ ఓవర్‌లో ప్రియాన్ష్ ఆర్య ఆరు సిక్స్‌లు కొట్టాడు. 

ప్రియాన్ష్ ఆర్య 50 బంతుల్లో 10 సిక్స్‌లతో 120 పరుగులు చేయగా, బదోనీ 55 బంతుల్లో 19 సిక్సర్లతో 165 పరుగులు చేశాడు. ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో సూపర్ స్టార్స్ 5 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. టీ20 చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన రెండో అత్యధిక స్కోర్ ఇది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన బదోనీ క్రికెట్ అభిమానులకు సుపరిచితుడు. మెగా వేలానికి ముందు అతను అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడాడు. 134 స్ట్రైక్ రేటుతో 634 పరుగులు చేశాడు.

రికార్డులు ఇవే...


- ప్రియాన్ష్ ఆర్య, ఆయుష్ బదోనీ 286 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
- ఒక ఇన్నింగ్స్‌లో 19 సిక్స్‌లు కొట్టి క్రిస్ గేల్ (18 సిక్సులు) పేరిట ఉన్న రికార్డును ఆయుష్ బదోనీ అధిగమించాడు. 
- ఒక ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల సరసన ప్రియాన్ష్ ఆర్య చేరాడు. యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్‌లు ఈ ఫీట్‌ను సాధించారు.
- గతంలో ఐపీఎల్‌లో నేపాల్ 26 సిక్స్‌లు కొట్టింది. ఇప్పుడు ఒక ఇన్నింగ్స్‌లో 31 సిక్స్‌లు కొట్టి సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నేపాల్‌ను వెనక్కి నెట్టింది.
- సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. టీ20ల్లో ఇది రెండో అత్యధికం. 2023లో మంగోలియాపై నేపాల్ 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News