Bandla Ganesh: ఏదో మూడ్ లో ఉండి అప్పుడు నోరు జారా: బండ్ల గణేశ్

Bandla Ganesh says sorry to Trivikram Srinivas

  • ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్ లో ఉన్నానన్న బండ్ల
  • ఆ మూడ్ లో త్రివిక్రమ్ పై నోరు జారానని వెల్లడి
  • త్రివిక్రమ్ కు క్షమాపణ చెపుతున్నానన్న బండ్ల

గతంలో ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు ఏదో మూడ్ లో ఉండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నోరు జారానని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. తప్పు చేశానని అనిపించిందని... ఆ తర్వాత తామిద్దరం కలిసి మాట్లాడుకున్నామని తెలిపారు. ఆయనకు క్షమాపణ చెపుతున్నానని అన్నారు. 'తీన్ మార్' సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నానని... కానీ, చిన్నచిన్న సమస్యల వల్ల అది మిస్ ఫైర్ అయిందని చెప్పారు. ఈ చిత్రాన్ని మళ్లీ అద్భుతంగా చేసి రీ రిలీజ్ చేస్తానని తెలిపారు.

More Telugu News