Heavy Rains: పిల్లల్ని బయటకు పంపొద్దు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ వార్నింగ్

GHMC issues safety notices ahead of heavy rain forecast for Hyderabad

  • నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
  • సేఫ్టీ నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ
  • వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • అత్యవసరమైతే 040 21111111, 9000113667 నంబర్లలో సంప్రదించాలన్న జీహెచ్ఎంసీ

హైదరాబాద్‌లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అప్రమత్తమైంది. జంట నగరాల ప్రజలకు సేఫ్టీ నోటీసులు జారీచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. 

మరీ ముఖ్యంగా వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపవద్దని సూచించింది. వరద నీటితో నిండిన వీధుల్లోకి రావొద్దని, మరీ ముఖ్యంగా ఇలాంటి రోడ్లపైకి బైకర్లు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని కోరింది. 

ఏదైనా అత్యవసరం అయితే సాయం కోసం జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 040 21111111కు కానీ, విపత్తు నిర్వహణ దళం (డీఆర్ఎఫ్) నంబర్ 9000113667కు ఫోన్ చేయాలని సూచించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులను మోహరించింది.

  • Loading...

More Telugu News