Samantha: మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న హేమ కమిటీ రిపోర్టుపై సమంత స్పందన
- జస్టిస్ హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నానన్న సమంత
- కేరళలో డబ్ల్యూసీసీ చేస్తున్న కృషికి ప్రశంసలు
- టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని కోరిన సమంత
మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, బెదిరింపు ఘటనలు జరిగినట్లుగా నివేదిక అందడంతో పినరయి విజయన్ సర్కార్ .. విచారణకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పలువురు నటీమణులు గతంలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియా ముందు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ప్రముఖ నటి సమంత స్పందించారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికను ఆమె స్వాగతించింది. కేరళలో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేస్తున్న కృషిని ప్రశంసించారు. టాలీవుడ్లోనూ మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని ఆమె కోరారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనూ ఆలాంటి చర్యలు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా, అది వైరల్గా మారింది.