Kadambari Jwthwani: నిజాలు బయటికి రావాలి: కన్నీటిపర్యంతమైన నటి కాదంబరి జెత్వానీ

Kadambari Jethwani press meet

  • విజయవాడ పోలీసులను కలిసిన కాదంబరి జెత్వానీ
  • వాంగ్మూలం నమోదు
  • అనంతరం మీడియా ముందుకు వచ్చిన నటి
  • కాంతిరాణా టాటా తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణ
  • ఏపీ పోలీసులు తనను కిడ్నాప్ చేశారని వెల్లడి 

విజయవాడ పోలీసులను కలిసి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ముంబయి నటి కాదంబరి జెత్వానీ మీడియా ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కన్నీటి పర్యంతమయ్యారు. నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఇవాళ విజయవాడ వచ్చానని వెల్లడించారు. దేశంలో మంచి వాళ్లు ఉన్నారని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. 

తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. నేను, నా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని కాదంబరి జెత్వానీ తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, అనేక రకాలుగా వేధించారని వివరించారు. వేధింపులకు సంబంధించి నా వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించానని వెల్లడించారు. 

కుక్కల విద్యాసాగర్ పై క్రిమినల్ కేసులు ఉన్నాయని కాదంబరి స్పష్టం చేశారు. విద్యాసాగర్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, కానీ అందుకు తాను వ్యతిరేకించానని చెప్పారు. దాంతో, విద్యాసాగర్ తనపై అసూయతో కక్షగట్టాడని ఆమె ఆరోపించారు. 

ఈ క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో... పోలీసు అధికారి కాంతిరాణా టాటా నేతృత్వంలో తనపై తప్పుడు కేసు పెట్టారని వెల్లడించారు. తనను 10 నుంచి 15 మంది ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని తెలిపారు. వారు తక్కువ స్థాయి అధికారులు అయ్యుంటారని అన్నారు. తన డివైస్ లన్నీ స్వాధీనం చేసుకున్నారని వివరించారు.

ఈ వ్యవహారంలో పొలిటికల్ లీడర్లకు సంబంధం ఉందా అనేది విచారణలో తేలాల్సి ఉందని అన్నారు. ఇప్పటివరకు తాను చెప్పినవన్నీ నిజాలేనని కాదంబరి జెత్వానీ స్పష్టం చేశారు. వేధింపుల కారణంగా తన తల్లిదండ్రుల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని చెబుతూ ఆమె భోరున విలపించారు.

Kadambari Jwthwani
Police
Vijayawada
Andhra Pradesh
Mumbai
  • Loading...

More Telugu News