HCA: హెచ్‌సీఏలో భారీ అవినీతి జరిగింది: తెలంగాణ క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి

TCA alleges scam in HCA

  • బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను హెచ్‌సీఏ దుర్వినియోగం చేసిందని ఆరోపణ
  • విచారణ జరిపి అసోసియేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్
  • హెచ్‌సీఏ క్లబ్బులన్నీ అవినీతిమయం అయ్యాయని వ్యాఖ్య

హెచ్‌సీఏలో భారీగా అవకతవకలు జరిగాయనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను హెచ్‌సీఏ దుర్వినియోగం చేసిందన్నారు. దీనికి సంబంధించి విచారణ జరిపి అసోసియేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ హయాంలో హెచ్ సీఏలో జరిగిన అవినీతి ఇప్పుడున్న అధ్యక్షుడు జగన్ మోహన్ రావు హయాంలోనూ కొనసాగుతోందన్నారు. హెచ్‌సీఏ పరిధిలోని క్లబ్బులన్నీ అవినీతిమయం అయ్యాయన్నారు.

సుప్రీంకోర్టు తీర్పును, గ్రామీణ క్రికెట్‌ను హెచ్ సీఏ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హెచ్‌సీఏపై ఏసీబీ, సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News