Avani Lekhara: పారా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన అవని... చరిత్ర సృష్టించిందన్న ప్రధాని మోదీ

Avani Lekhara grabs gold in Paris Para Olympics

  • పారిస్ లో పారా ఒలింపిక్ పోటీలు
  • షూటింగ్ లో నేడు భారత్ కు రెండు పతకాలు
  • 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో అవని లేఖర గోల్డెన్ హిట్
  • కాంస్యం సాధించిన మోనా అగర్వాల్ 

పారిస్ నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ అవని లేఖర స్వర్ణం సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని అదరగొట్టింది. 

అవని 2020 పారా ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో ఒక పసిడి, ఒక కాంస్యం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ లోనూ ఈ రాజస్థాన్ షూటర్ అంచనాలను అందుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 

కాగా, రాజస్థాన్ కే చెందిన మరో మహిళా షూటర్ మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది. కాగా, అవని, మోనాలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అవని పారా ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించిందని కొనియాడారు. ఆమె అంకితభావం భారత్ గర్వపడేలా చేస్తోందని పేర్కొన్నారు.

కాంస్యం సాధించిన మోనా అగర్వాల్ ను కూడా మోదీ అభినందించారు. మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు మోనా చూపిస్తున్న అంకితభావం ఇవాళ సాధించిన కాంస్యం ద్వారా ప్రతిఫలించిందని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News