Rao Ramesh: మనోడే అన్నారంటే ఇక డబ్బులు ఇవ్వరని అర్థం సార్: రావు రమేశ్   

Rao Ramesh Interview

  • విలక్షణ నటుడిగా రావు రమేశ్ కి పేరు 
  • ప్రధాన పాత్రధారిగా చేసిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం'
  • ప్రామ్టింగ్ అలవాటు లేదని వెల్లడి 
  •  ఆ ప్రచారంలో నిజం లేదని వ్యాఖ్య


తెలుగులో విలక్షణ నటుడిగా రావు రమేశ్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన పోషించిన కొన్ని పాత్రలు ప్రేక్షకులకు అలా గుర్తుండి పోతాయి. ఇంతవరకూ కేరక్టర్ ఆర్టిస్ట్ గా కీలకమైన పాత్రలను పోషిస్తూ వచ్చిన రావు రమేశ్, రీసెంటుగా తాను ప్రధాన పాత్రధారిగా 'మారుతీనగర్ సుబ్రమణ్యం' చేశారు. కథాకథనాల పరంగా .. రావు రమేశ్ నటన పరంగా ఈ సినిమా మంచి మార్కులను తెచ్చుకుంది. 

'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రావు రమేశ్ మాట్లాడుతూ .. "తెలుగులోనే కాదు .. తమిళ, కన్నడ సినిమాలలోను నేను చేస్తున్నాను. ఎక్కడ కూడా నేను ప్రామ్టింగ్ తీసుకోలేదు. నేను నేర్చుకుని అప్పుడు ఆ డైలాగ్స్ చెబుతాను. భాషపై అవగాహన లేకపోతే కోట ..  ప్రకాశ్ రాజ్ లాంటి సీనియర్స్ దగ్గర దొరికిపోతాం. అందువల్లనే నేను ఆ భాష నేర్చుకునే చెబుతూ ఉంటాను" అని అన్నారు. 

"నేను ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నాననే కామెంట్స్ వినిపిస్తున్నాయని అంటున్నారు. తెలుగు వాడిని కాబట్టి తేలికగా కామెంట్స్ చేస్తారు. బయటవాళ్లు రెండు మూడింతలు ఎక్కువగా తీసుకున్నా వాటిని గురించి రాయరు. మనోడే అనుకుని కూడా అలా కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ ప్రమాదం ఉంది. మనోడే అనుకున్నారంటే ఇక డబ్బులు ఇవ్వరని అర్థం. 

"మనోడే అనుకుంటే నువ్వు కూడా కారు పంపించమంటావేంటి? అంటారు. మనోడే అనుకుంటే క్యారెక్టర్ ఏంటని అడిగావుటా అంటారు. ఇక అంతే ప్రమాదమైన మాట 'భలేవారే సార్'.  ఇన్ని రోజులన్నారు .. మరి అన్ని రోజులైపోయిందని అంటే, 'భలేవారే' అనేస్తారు. అంటే ఏమీ ఇవ్వరన్న మాట. కనుక నేను నా స్థాయికి తగినట్టుగా అడుగుతాను. అవతల వాళ్లు ఎక్కడి నుంచో బేరాలు మొదలుపెట్టి ఒక దగ్గర సెట్ చేస్తారు అంతే" అని చెప్పారు.

  • Loading...

More Telugu News