Anju: కన్నడ ప్రభాకర్ చనిపోయినా నేను వెళ్లనిది అందుకే: నటి అంజూ ప్రభాకర్

Anju Prabhakar Interview

  • కన్నడ ప్రభాకర్ అలా మోసం చేశాడు 
  • ఆయనకి నా కంటే పెద్ద పిల్లలు ఉన్నారు
  • మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోలేదు 
  • ఆయన పోయినప్పుడు తాను వెళ్లలేదన్న అంజూ

చైల్డ్ ఆర్టిస్టుగా మీనాతో పాటు ఎక్కువ సినిమాలలో నటించిన మరో పాప పేరు అంజూ.  బాలనటిగా తెలుగులో పాతిక సినిమాల వరకూ చేసిన ఆమె, ఆ తరువాత మీనా మాదిరిగానే హీరోయిన్ గా తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేశారు.  మొత్తంగా 150 సినిమాల వరకూ చేసిన అంజూ, ఆ తరువాత, విలన్ గా రాణించిన కన్నడ ప్రభాకర్ ను  వివాహం చేసుకున్నారు. ఆ విషయాలను గురించి తాజాగా ఆమె ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

"తమిళంలో రజనీకాంత్ .. కమల్, తెలుగులో శోభన్ బాబు .. చిరంజీవి .. రాజశేఖర్ సినిమాలలో బాలనటిగా చేశాను. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు వస్తూ ఉంటే చేస్తూ వెళ్లాను. ఆ సమయంలోనే కన్నడ ప్రభాకర్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆయనకి పెళ్లయింది .. విడాకులు జరిగాయని చెప్పారు. అందువలన పెళ్లి చేసుకున్నాను .. కానీ ఆయన మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదు. అందువలన మా పెళ్లి చెల్లదని నాకు తెలుసు" అని అన్నారు.

" ప్రభాకర్ నన్ను ఎక్కడికీ తీసుకుని వెళ్లేవారు కాదు .. ఇంటిని ఒక జైలుగా చేశారు. ఎవరితో మాట్లాడే అవకాశం లేకపోవడం వలన, ఆయన గురించి నాకు తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయనతో పెళ్లి జరిగింది. ఆయన ముగ్గురు పిల్లలకి నాకంటే వయసు ఎక్కువని తెలిసి షాక్ అయ్యాను. నన్ను అలా మోసం చేయడం వలన పుట్టింటికి వచ్చేశాను. ఆయన పోయినప్పుడు కూడా నేను వెళ్లలేదు" అని చెప్పారు.

Anju
Kannada Prabhakar
Actress
  • Loading...

More Telugu News