Pawan Kalyan: చర్చనీయాంశమైన పవన్ వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్

Producer Ravishankar gives clarity on Pawan comments

  • చెట్ల నరికివేత, స్మగ్లింగ్ పై ఇటీవల పవన్ వ్యాఖ్యలు
  • అల్లు అర్జున్ 'పుష్ప2' గురించేనంటూ పెద్ద ఎత్తున చర్చ
  • పవన్ ఎప్పుడూ అలా మాట్లాడరన్న రవిశంకర్

సినిమాల్లో చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ 'పుష్ప 2' గురించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది. 

ఈ అంశంపై సినీ నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు 'పుష్ప 2' గురించి కాదని, పవన్ ఎప్పుడూ ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడరని చెప్పారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటేనని అన్నారు. 

పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంగా ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడిన సందర్భంగానే రవిశంకర్... పవన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 


More Telugu News