Vishal: రాజకీయాల్లోకి రావడమే బెటర్ అనిపిస్తోంది... వస్తా: హీరో విశాల్

I will come into politics says Vishal

  • సింపుల్ గా ఉండటం తనకు ఇష్టమన్న విశాల్
  • కొంత కాలం క్రితం కారు అమ్మేశానని వెల్లడి
  • విషయం ఏదైనా నిజాయతీగా మాట్లాడతానన్న విశాల్

కోలీవుడ్ హీరో విశాల్ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అన్ని పనులు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనిపిస్తోందని... త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, ప్రజాసేవ చేస్తానని విశాల్ తెలిపారు. విషయం ఏదైనా సరే తాను నిజయతీగా మాట్లాడతానని... తన మాదిరి అందరూ ఉండలేరని చెప్పారు.

తనకు చాలా సింపుల్ గా ఉండటమే ఇష్టమని సినీ హీరో విశాల్ చెప్పారు. ఆడంబరంగా బతకడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. ఇతరులను కాపీ కొట్టడం కూడా తనకు నచ్చదని తెలిపారు. 

గతంలో ఓ ఎన్నికల సమయంలో తాను సైకిల్ పై వెళ్లడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయని... హీరో విజయ్ ను తాను కాపీ కొట్టానని పలువురు విమర్శించారని... తనకు కాపీ కొట్టడం తెలియదని చెప్పారు. పోలింగ్ బూత్ కు తమ ఇల్లు దగ్గర్లోనే ఉండటంతో తాను సైకిల్ పై వెళ్లానని తెలిపారు. విజయ్ ను ఇమిటేట్ చేయడం కోసం అలా చేయలేదని చెప్పారు. 

ప్రస్తుతం తన తల్లిదండ్రులకు మాత్రమే కారు ఉందని, తనకు లేదని, కొంతకాలం క్రితం అమ్మేశానని విశాల్ ఇటీవల రత్నం సినిమా ప్రమోషన్స్ లో తెలిపారు. చెన్నైలో రోడ్లు దారుణంగా ఉన్నాయని... సైకిల్ పై అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చని చెప్పారు. 


Vishal
Kollywood
Tollywood
  • Loading...

More Telugu News