Pilli Subhas Chandra Bose: జగన్ తోనే ఉంటా... వెన్నుపోటు పొడవలేను: పిల్లి సుభాష్ చంద్రబోస్

I will be with Jagan says Pilli Subhash Chandra Bose

  • పిల్లి సుభాష్ వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం
  • తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినన్న సుభాష్
  • తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు హితవు

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సుభాష్ చంద్రబోస్ స్పందించారు. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినని ఆయన అన్నారు. వైసీపీని వీడి తాను వెన్నుపోటు పొడవలేనని, తాను జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. 

నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నానన్నారు. తప్పుడు వార్తలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ విన్నవించారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. వైసీపీని వీడే ఆలోచన తనకు కలలో కూడా లేదని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

Pilli Subhas Chandra Bose
Jagan
YSRCP
  • Loading...

More Telugu News