Hidden Cameras: బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా క‌ల‌క‌లం.. అర్ధ‌రాత్రి విద్యార్థినుల ఆందోళ‌న‌

Hidden Cameras in Engineering College Ladies Hostel Bathroom

  • కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఘ‌ట‌న‌
  • లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో బ‌య‌ట‌ప‌డ్డ‌ హిడెన్ కెమెరా
  • బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి పనేనని ఆరోప‌ణ‌

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం రేగింది. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బ‌య‌ట‌ప‌డింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేశారు.

ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు, ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

అత‌డి ల్యాప్ ట్యాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ సంఘ‌ట‌న వారం క్రిత‌మే వెలుగులోకి వ‌చ్చినా కాలేజీ యాజమాన్యం ప‌ట్టించుకోలేద‌ని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News