Barinder Sran: ధోనీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసిన ఆటగాడి రిటైర్మెంట్

left arm fast bowler Barinder Sran has quits from international and domestic cricket

  • అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బరీందర్ స్రాన్
  • 2016లో భారత్‌ జట్టులోకి అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్
  • భారత్ తరపున 6 వన్డేలు, 2 టీ20లు ఆడిన ప్లేయర్

మాజీ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ బరీందర్ స్రాన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 31 ఏళ్ల ఈ క్రికెటర్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. జనవరి 2016లో అరంగేట్రం చేసిన అతడు జూన్ 2016 వరకు భారత్ తరపున 6 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత రాణించలేకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. తిరిగి ఆ తర్వాత ఎప్పుడూ జట్టులోకి రాలేదు. దీంతో దాదాపు 8 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ ప్రకటన చేశాడు. మైదానంలో, వెలుపల తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. తాను క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్ అవుతున్నానని, కృతజ్ఞతా భావం నిండిన హృదయంతో ప్రయాణాన్ని ముగిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. క్రికెట్ తనకు ఎన్నో అనుభవాలను అందించిందని, ప్రతిష్ఠాత్మక ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించానని, చివరికి 2016లో భారత జట్టుకు ఆడడంతో అత్యున్నత గౌరవం పొందానని బరీందర్ వ్యాఖ్యానించాడు.  

ఫాస్ట్ బౌలర్ అయిన బరీందర్ స్రాన్ వన్డేల్లో 7 వికెట్లు, టీ20ల్లో 6 వికెట్లు తీశాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో అతడు 137 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ఆడాడు. మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు. కాగా బరీందర్ స్రాన్ ఫిబ్రవరి 2021లో పంజాబ్ తరపున విజయ్ హజారే ట్రోఫీలో చివరి మ్యాచ్ ఆడాడు. మధ్యప్రదేశ్‌పై మ్యాచ్‌లో 24 పరుగులు చేయడమే కాకుండా తన బౌలింగ్ ఒక వికెట్ తీశాడు.

  • Loading...

More Telugu News