Nara Lokesh: విశాఖ కోర్టుకు హాజ‌రైన‌ మంత్రి నారా లోకేశ్‌

Minister Nara Lokesh will Appear in Vizag Court


సాక్షిపై పరువు నష్టం కేసులో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కోర్టుకు హాజరయ్యారు. విశాఖప‌ట్ట‌ణం 12వ అదనపు జిల్లా కోర్టుకు లోకేశ్‌ హాజరయ్యారు. ‘‘చిన‌బాబు చిరుతిండి.. 25 ల‌క్షలండి’’ పేరుతో సాక్షి వార్త పత్రిక‌లో గతంలో ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. దీనిపై ఆయన కోర్టును ఆశ్ర‌యించి న్యాయ‌ పోరాటం చేస్తున్నారు. దీనిలో భాగంగా లోకేశ్‌ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. వేర్వేరు కార‌ణాల‌తో చాలా రోజులుగా వాయిదాలు ప‌డిన ఈ కేసు గురువారం విచారణకు రావ‌డంతో ఆయ‌న కోర్టుకు వెళ్లారు.

Nara Lokesh
TDP
Visakhapatnam
Andhra Pradesh
  • Loading...

More Telugu News