Allu Arjun: పుష్ప-2 నుంచి అల్లు అర్జున్ నయా పోస్టర్ రిలీజ్

Allu Arjun new poster from Pushpa2 The Rule released

  • అల్లు అర్జున్, రష్మిక జంటగా పుష్ప-2: ది రూల్
  • సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్
  • డిసెంబరు 6న గ్రాండ్ రిలీజ్
  • మరో 100 రోజుల్లో అంటూ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్ 

'పుష్ప-2: ది రూల్' చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ నేడు అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ కానుంది అంటూ పేర్కొన్నారు. 

ఈ క్రమంలో అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ను కూడా పంచుకున్నారు. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సీరియస్ నెస్ ను చూడొచ్చు. 

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప-2 చిత్రంపై బజ్ మామూలుగా లేదు. పుష్ప సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో, సీక్వెల్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 

సెకండ్ పార్ట్ లో ఫహాద్ ఫాజిల్ పాత్రపై అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన ట్రేడ్ మార్క్ సాంగ్స్ తో ఇప్పటికే ఆడియన్స్ లోకి పుష్ప-2పై మరింత క్రేజ్ క్రియేట్ చేశాడు.

More Telugu News