K Kavitha: ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కవిత... ఘనస్వాగతం పలికిన బీఆర్ఎస్

Kavitha arrives Hyderabad from Delhi

  • లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్
  • గత రాత్రి తీహార్ జైలు నుంచి విడుదల
  • ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

కవిత వెంట ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్నారు. కవిత ఎంతో ఉత్సాహంగా ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి వచ్చారు. 

దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవిత హైదరాబాద్ లో అడుగుపెట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. కాగా, కవిత హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ కు వెళతారని తెలుస్తోంది.

K Kavitha
Hyderabad
New Delhi
Bail
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News