Kolkata Rape Murder Case: కోల్‌కతా హత్యాచార ఘటన... నిందితుడి తరఫున వాదిస్తోంది ఎవరో తెలుసా?
- దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటన
- ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు
- నిందితుడు సంజయ్ రాయ్ తరఫున వాదించేందుకు ముందుకు రాని లాయర్లు
- కేసులో పారదర్శకత కోసం లీగల్ ఎయిడ్‌కు కోర్టు సిఫార్సు
- దాంతో నిందితుడి తరఫున వాదించే బాధ్యతలు కవితా సర్కార్‌కు అప్పగింత
కోల్‌కతా జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. దీంతో బాధితురాలికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే, నిందితుడు సంజయ్ రాయ్ తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాలేదు. కానీ పారదర్శక విచారణ కోసం నిందితుడి వాదనలు వినడం కూడా కేసులో ముఖ్యమని భావించిన కోర్టు లీగల్ ఎయిడ్‌కు సిఫార్సు చేసింది.
ఇందులో భాగంగా నిందితుడు తరఫున వాదించే బాధ్యతలను కోల్‌కతాకు చెందిన మహిళా న్యాయవాది కవితా సర్కార్‌కు అప్పగించడం జరిగింది. దీంతో ఆమె పేరు ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో మార్మోగిపోతోంది.