Stock Market: మార్కెట్లలో ఒడిదుడుకులు... ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్లలో ఒడిదుడుకుల ప్రభావం సెన్సెక్స్, నిఫ్టీపై పడింది. సెన్సెక్స్ 73 పాయింట్ల వృద్ధితో 81,785 వద్ద ముగియగా... నిఫ్టీ 34 పాయింట్ల స్వల్ప లాభంతో 25,052 వద్ద స్థిరపడింది.
ఇవాళ్టి ర్యాలీలో నిఫ్టీ ఓ దశలో జీవనకాల గరిష్ఠం 25,129 పాయింట్లను తాకింది.
నేటి ట్రేడింగ్ లో ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల షేర్లు లాభాలు అందుకోగా.... ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
విప్రో, భారతి ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్ సీఎల్ టెక్ లాభాల బాటలో పయనించాయి.
ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్ బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలు చవిచూశాయి.