Niharika: ఓటీటీలో నిహారిక కొణిదెల 'బెంచ్ లైఫ్'

Bench Life Web Series Upadate

  • నిహారిక కొణిదెల నిర్మాతగా 'బెంచ్ లైఫ్'
  • ఐటీలో బెంచ్ పై ఉండే ఉద్యోగుల కథ 
  • సరదాగా సాగిపోయే వెబ్ సిరీస్ 
  • సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్


ఒక వైపున చిన్న సినిమాలపై .. మరో వైపున వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతూ నిహారిక ముందుకు వెళుతోంది. చాలా కాలం క్రితమే నిహారిక వెబ్ సిరీస్ లకు శ్రీకారం చుట్టింది. ఆ తరువాత తన సొంత బ్యానర్ నుంచి ఒక్కో సిరీస్ ను వదులుతూ వెళుతోంది. అలాంటి నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ గా 'బెంచ్ లైఫ్' కనిపిస్తుంది. 

మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు .. ఉద్యోగుల చుట్టూ తిరుగుతుంది. సంస్థకి సంబంధించిన ఏ ప్రాజెక్టులో లేని ఉద్యోగులను 'బెంచ్'లో ఉన్నట్టుగా పరిగణిస్తారు. అలా బెంచ్ పై ఉన్న కొంతమంది యువతీ యువకుల కథనే 'బెంచ్ లైఫ్'. పని లేకుండా ఖాళీగా ఉండటం వలన వాళ్లు ఏం చేస్తారు? అవి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి? అనేది కథ. 

ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ తీసుకుంది. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. వైభవ్ రెడ్డి .. రితికా సింగ్ ..  ఆకాంక్ష సింగ్ .. చరణ్ పేరి .. వెంకట్ కాకుమాను ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ లో, రాజేంద్ర ప్రసాద్ .. తులసి .. తనికెళ్ల భరణి ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

  • Loading...

More Telugu News