Annamalai: మూడు నెలల కోర్సు చేసేందుకు బ్రిటన్ వెళ్లిన అన్నామలై... తమిళనాడు బీజేపీ శ్రేణుల భావోద్వేగ వీడ్కోలు

Tamil Nadu BJP Chief Annamalai leaves for UK to join Oxford University fellowship

  • ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్సిటీలో ఫెలో షిప్ కు అవకాశం
  • మూడు నెలలు తమిళనాడుకు దూరంగా ఉండనున్న అన్నామలై
  • ఫోన్ ద్వారా పార్టీ శ్రేణులకు అందుబాటులోనే ఉంటానన్న అన్నామలై

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఉన్నత విద్యాభ్యాసం కోసం బ్రిటన్ వెళ్లారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో షెవెనింగ్ గురుకుల్ ఫెలోషిప్ ఫర్ లీడర్ షిప్ అండ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ కోర్సులో చేరే అవకాశం వచ్చింది. ఈ కోర్సు కాల వ్యవధి మూడు నెలలు. 

కాగా, యూకే బయల్దేరే ముందు చెన్నై ఎయిర్ పోర్టులో భావోద్వేగభరిత దృశ్యాలు కనిపించాయి. కార్యకర్తలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. 

విమానం ఎక్కే ముందు అన్నామలై మీడియాతో మాట్లాడుతూ, మూడు నెలల ఫెలోషిప్ కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చేరేందుకు వెళుతున్నానని వెల్లడించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సీనియర్ నేతలందరూ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఓ ఫెలోషిప్ కు ఎంపికవడం తనకు ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. 

ఆక్స్ ఫర్డ్ వర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పటికీ, సమస్యలపై ప్రకటనల ద్వారా ఎలుగెత్తుతానని, తమిళనాడు ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తానని అన్నామలై స్పష్టం చేశారు. నా హృదయం, నా కళ్లు ఇక్కడే ఉంటాయి... పార్టీ శ్రేణులకు, నేతలకు ఫోన్ ద్వారా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News