Biju Menon: 'సోనీ లివ్' ఫ్లాట్ ఫామ్ పైకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్!

Thalavan Movie Update

  • మలయాళంలో రూపొందిన 'తలవన్'
  • పోలీస్ పాత్రల్లో బిజూ మీనన్ - అసిఫ్ అలీ 
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు 
  • సెప్టెంబర్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్


సోనీ లివ్ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి మరో మలయాళ సీమ సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'తలవన్'. బిజూ మీనన్ - అసిఫ్ అలీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. 10 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ చాలా వేగంగా 25 కోట్లకు కొల్లగొట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. 

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ వారు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదులుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి, జిస్ జాయ్ దర్శకత్వం వహించాడు. కథానాయికలుగా మియా జార్జ్ - అనుశ్రీ కనిపించనున్నారు.  

ఈ కథ అంతా ఎస్ ఐ కార్తీక్ - సీఐ జయశంకర్ చుట్టూ తిరుగుతుంది. ఒక కేసు విషయంలో కార్తీక్ నొచ్చుకునేలా జయశంకర్ ప్రవర్తిస్తాడు.ఆ లాంటి జయశంకర్ ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. అప్పుడు కార్తీక్ ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది కథ. 7 భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.


More Telugu News