Viral Video: విమానంలో బ్రెడ్ కోసం పిండి కలిపిన వ్లాగర్.. విరుచుకుపడుతున్న యూజర్లు

Woman Prepares Bread Dough In Aircraft Video Went Viral

  • స్పెయిన్ వెళ్తున్న విమానంలో బ్రెడ్ పిండి కలిపిన మహిళ
  • తీరిగ్గా ఓ పాత్రలో నీళ్లు పోసి, పిండివేసి కలిపిన వ్లాగర్
  • ఆ తర్వాత కాసేపు నాననిచ్చాక మళ్లీ చూపిస్తూ ఎంత మృదువుగా ఉందో కదా అని కామెంట్
  • విమానంలో ఇవేం పిచ్చి పనులంటూ సోషల్ మీడియా ఫైర్
  • మిలియన్ వ్యూస్ సంపాదించుకున్న వీడియో

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందివచ్చిన తర్వాత మహిళలు ఇంటి పనులు కూడా బస్సుల్లో చేసుకుంటున్నట్టు కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దీనికి మించిపోయే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఓ మహిళ ఏకంగా విమానంలో బ్రెడ్ కోసం పిండి ముద్ద తయారుచేసింది. ఈ వీడియోపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

విమానంలో స్పెయిన్ వెళ్తున్న ఓ మహిళ విండో సీట్ పక్కన కూర్చుని ఏకంగా బ్రెడ్ పిండితయారుచేసింది. వ్లాగర్ అయిన ఆమె భూమికి కొన్ని వేల అడుగున ఎత్తున రొట్టె పిండి చేస్తున్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న పాత్రలో తొలుత నీళ్లు వేసి ఆపై పిండి వేసింది. అందులో సరిపడా ఉప్పు వేసి చపాతి పిండిలా కలిపింది. దానిపై తడిగుడ్డ కప్పింది. కాసేపటికి పిండి మృదువుగా తయారైంది. ఆ తర్వాత రాత్రంతా ఉంచి పులియబెట్టాలని పేర్కొనడంతో వీడియో ముగుస్తుంది.  

ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే యూజర్లు కామెంట్లతో హోరెత్తించారు. విమానంలో అలాంటి పిచ్చిపనేంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించేందుకేనని మరికొందరు కామెంట్ చేశారు. తానే కనుక విమానంలో ఆమె పక్కన కూర్చుంటే వెంటనే మరో సీటుకు మారిపోయి ఉండేవాడినని ఓ యూజర్ రాసుకొచ్చాడు. విమానమేమైనా వంట చేసే ప్రదేశమా? అని మరొకరు మండిపడ్డారు. మరో యూజర్ అయితే.. ఈ వీడియోకు పార్ట్ 2 కూడా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. 

ఈ కామెంట్లపైనా ఆమె స్పందించింది. ఓ క్రియేటర్ విమానంలో పాస్తా చేయడం చూసి తానిది ట్రై చేశానని, ఏది ఏమైనా మీ కామెంట్లకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్టు పేర్కొంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

View this post on Instagram

A post shared by Maria Baradell (@leafandloafco)

Viral Video
Bread Making On Flight
Spain
Offbeat
  • Loading...

More Telugu News