K Kavitha: తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత... కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగం

Kavitha released from Tihar jail

  • రాత్రి ఎనిమిది గంటల తర్వాత జైలు నుంచి విడుదలైన కవిత
  • జైలు బయట స్వాగతం పలికిన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు
  • కుటుంబ సభ్యుల్ని హత్తుకొని కన్నీటిపర్యంతమైన కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దాదాపు ఆరు నెలల క్రితం అరెస్టైన కవితకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే తన కుటుంబ సభ్యులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు జైలు నుంచి బయటకు వచ్చిన కవితకు ఘన స్వాగతం పలికారు. భర్త అనిల్ ను, సోదరుడు కేటీఆర్ ను, కొడుకులను హత్తుకొని కవిత కన్నీటిపర్యంతమయ్యారు. కవిత రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. నేరుగా ఫామ్ హౌస్‌కు వెళ్లి తండ్రి కేసీఆర్‌ను కలుస్తారు.

K Kavitha
Delhi Liquor Scam
Telangana
BRS
  • Loading...

More Telugu News