Sheikh Noorjahan: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ నూర్జహాన్

Eluru Mayor Noorjahan joins TDP

  • వైసీపీకి మరో ఎదురుదెబ్బ
  • వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు
  • పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్

వైసీపీకి ఎదురుదెబ్బల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇవాళ ఆమె తన భర్త పెదబాబుతో కలిసి మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

నారా లోకేశ్ నూర్జహాన్, పెదబాబు దంపతులకు పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటే మరికొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీలోకి వచ్చారు. ఉండవల్లిలోని నారా లోకేశ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. 

కాగా, చాలామంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాధాకృష్ణ వెల్లడించారు. ఏలూరు అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారికి టీడీపీ స్నేహహస్తం అందిస్తుందని అన్నారు. 

మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ... వైసీపీ తన ఓటమి నుంచి ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదని, టీడీపీ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలుపుకుంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.

Sheikh Noorjahan
Pedababu
TDP
Nara Lokesh
Eluru Mayor
YSRCP
  • Loading...

More Telugu News