K Kavitha: కవిత విడుదల కోసం... జైలు ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఎదురుచూపు

BRS leaders waiting for Kavitha release

  • తీహార్ జైలు వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులు
  • రాత్రి ఎనిమిది గంటల తర్వాత కవిత విడుదలయ్యే అవకాశం
  • జైలు బయట శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తదితర నేతలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. కవిత విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి 8 గంటల తర్వాత విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆమె విడుదల అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తీహార్ జైలు వద్దకు చేరుకున్నారు. వారు కవిత విడుదల కోసం వేచి చూస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తదితర నేతలు జైలు వద్ద వేచి చూస్తున్నారు.

జైలు నుంచి విడుదలైనప్పటికీ కవిత ఈరోజు రాత్రికి ఢిల్లీలో బ‌స చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె ఉండనున్నారు. రేపు ట్రయల్ కోర్టు విచారణ అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, కేటీఆర్, హరీశ్ రావు హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి ఫామ్ హౌస్ చేరుకుంటారు.

K Kavitha
BRS
Telangana
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News