KTR: చెల్లి కోసం... ఢిల్లీలో ఆటో ఎక్కిన కేటీఆర్

KTR rides on Auto in Delhi

  • కవితకు బెయిల్ వచ్చాక పరుగులు పెట్టిన కేటీఆర్
  • పత్రాలు సమర్పించేందుకు న్యాయవాదులతో కలిసి పరుగు
  • ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ సమయంలో ఆటోలో ప్రయాణించిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఆటో ఎక్కారు. తన చెల్లెలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన అనంతరం కోర్టులో అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ఆయన న్యాయవాదులతో కలిసి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఓ సమయంలో కేటీఆర్ ఆటో ఎక్కారు.

సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత కారులో బయలుదేరారు. అయితే ట్రాఫిక్ జామ్ కావడంతో కేటీఆర్ కారును వదిలి ఆటో ఎక్కారు. సుప్రీంకోర్టు నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసానికి ఆటోలో వెళ్లారు. తన సోదరి బెయిల్ ప్రక్రియను ఈరోజే పూర్తి చేసి, చెల్లిని జైలు నుంచి విడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. కవిత ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.

KTR
New Delhi
K Kavitha
Delhi Liquor Scam

More Telugu News