Dastagiri: కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి

Dastagiri met Kadapa SP and complained

  • గత ఐదేళ్ల పాటు తనను ఇబ్బందులకు గురిచేశారన్న దస్తగిరి
  • జగన్, భారతి, అవినాశ్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలపై ఫిర్యాదు
  • తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని స్పష్టీకరణ

వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి నేడు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ను కలిశాడు. జగన్, భారతీ రెడ్డి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి తనను ఐదేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదు చేశాడు. 

వైసీపీ హయాంలో పోలీసులు కట్టు బానిసలుగా మాదిరిగా పనిచేశారని దస్తగిరి పేర్కొన్నాడు. జైల్లో ఉన్నప్పుడు అధికారులు తనను హింసించారని, కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ వైసీపీ నేతలకు తొత్తుగా మారాడని ఆరోపించాడు. 

దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను ప్రలోభాలకు గురిచేశాడని, వివేకా హత్య కేసులో రాజీకి రావాలని డబ్బు ఆశ చూపారని వెల్లడించాడు. చైతన్యరెడ్డి మాట వినకపోవడంతో జైలులో తనను హింసించారని దస్తగిరి వాపోయాడు. తాను జైలులో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజిని తొలగించారని ఆరోపించాడు. 

ఆనాటి ఘటనలపై విచారణ జరిపించాలని ఎస్పీని, సీబీఐని కోరుతున్నానని, తప్పుచేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశాడు. 

  • Loading...

More Telugu News